NGKL: బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ పట్టణ సమన్వయకర్తగా అరుణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. BSF రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆమెకు నియామాక పత్రాన్ని శనివారం అందజేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యలను పట్టించుకోవడంలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో సుమిత్ర, పల్లవి, ప్రమీల, ఐశ్వర్య రిషితా, కవిత పాల్గొన్నారు.