NRML: జిల్లా కేంద్రంలో ఎల్ఐసీ యూనియన్ భవన నిర్మాణానికి ఎంపీ లార్డ్స్ నిధులలో ఐదు లక్షలు మంజూరయ్యాయి. కాగా శనివారం ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సంబంధిత ప్రొసీడింగ్ పత్రాన్ని యూనియన్ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ సభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేస్తూ శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.