NLR: బుచ్చి మండలం ఆర్ఆర్ నగర్ వద్ద ముంబై జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నెల్లూరు నుండి బద్వేలువైపు వెళుతున్న బస్సు రాంగ్ రూట్లో యూ టర్న్ తీసుకుంటున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ మృతి చెందగా ఆటోలో ప్రయాణిస్తున్న మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.