NGKL: కల్వకుర్తి పట్టణంలోని మహబూబ్నగర్ చౌరస్తా ఉడిపి హోటల్ వద్ద శనివారం మధ్యాహ్నం ఏడుస్తూ కనిపించిన దాదాపు మూడేళ్ల బాలికను స్థానిక పోలీసులు అక్కున చేర్చుకొని స్టేషన్కు తీసుకెళ్లారు. ఈ బాలికను ఎవరైనా గుర్తిస్తే స్థానిక పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని పోలీస్ సిబ్బంది కోరారు. పోలీసుల అధీనంలో ఉన్న బాలిక హిందీ మాట్లాడుతుందని తెలిపారు.