అన్నమయ్య: సెప్టెంబర్ 14వ తేదీన టాప్ గ్రేడ్ బొప్పాయి ఎగుమతి ధర కిలోకు రూ. 8గా,సెకండ్ గ్రేడ్ ధర కిలోకు రూ. 7గా నిర్ణయించినట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి శనివారం తెలిపారు. తక్కువ ధరకు అమ్మే వ్యాపారులపై రైతులు ఫిర్యాదు చేయాలని, కంట్రోల్ రూమ్ నెంబర్లు 9573990331, 9030315951లను సంప్రదించాలని సూచించారు.