ADB: యూరియాపై ప్రతిపక్షాలు చేస్తున్న అనవసర రాద్ధాంతాన్ని చూసి రైతులు ఆందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని DCCB చైర్మన్ అడ్డీ బోజారెడ్డి అన్నారు. పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం సమావేశమై మాట్లాడారు. రైతులకు నెలకు సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వ అసమర్ధత వల్లే రైతులకు యూరియా కష్టాలు వచ్చాయని ఆరోపించారు.