ప్రకాశం: కనిగిరి కోర్టు ఆవరణలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా జూనియర్ సీవిల్ జడ్జి రూపశ్రీ మాట్లాడుతూ.. జాతీయ లోక్ అదాలత్లో మొత్తం 809 కేసులు పరిష్కారం అయినట్లు ఆమె తెలిపారు. క్రిమినల్ కేసులు 46, సివిల్ కేసులు 3, భరణం కేసులు 4,ఎస్టీసీ, 756 కేసులను ఇరువర్గాల వారిని రాజీ కుదిర్చి పరిష్కరించినట్లు జడ్జి తెలిపారు.