AKP: నక్కపల్లి మండలం న్యాయం పూడి గ్రామ రెవెన్యూ పరిధిలో హెట్రో పరిశ్రమ నిర్మిస్తున్న గ్యాస్ షెడ్ పనులను వెంటనే నిలిపివేయాలని ఎంపీటీసీ ఆకేటి గోవిందరావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు హోంమంత్రి వంగలపూడి అనితకు వినతి పత్రం అందజేశారు. జనవాసాలు మధ్య దీనిని నిర్మిస్తుండడంతో ప్రమాదాలు జరుగుతాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు ఎంపీటీసీ తెలిపారు.