MHBD: సీరోలు మండలంలోని తహసీల్దార్ పూర్ణచందర్ అధికారులతో ఈరోజు సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు 635 మెట్రిక్ టన్నుల యూరియాను పంపిణీ చేశామని తెలిపారు. రైతు బంధు జాబితా ఆధారంగా యూరియా అందని రైతులకు ప్రాధాన్యత ఇస్తూ వాట్సాప్ గ్రూపుల ద్వారా సమాచారం అందిస్తామని చెప్పారు. పోలీసు, రెవెన్యూ, పంచాయితీ, వ్యవసాయ శాఖల సమన్వయంతో పంపిణీ జరుగుతుందని పేర్కొన్నారు.