నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూ నిర్వాసితులకు నష్టపరిహారం పెంచారని శనివారం హైద్రాబాద్లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఆయనను క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఎకరాకు రూ. 14 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. భూ సేకరణ పనులు వేగంగా చేపడుతామని చెప్పారు.