TG: కామారెడ్డి జిల్లా బీబీపేటలో ఇవాళ యూరియా కోసం రైతుల మధ్య ఘర్షణ నెలకొంది. యూరియా కోసం వందల మంది రైతులు ఒకేసారి రావడంతో.. పోలీసులు కూడా అదుపు చేయలేకపోయారు. దీంతో రైతులను అధికారులు పోలీస్ స్టేషన్కు పిలిపించి.. పోలీసుల సమక్షంలో టోకెన్లు అందించారు. అయితే పోలీస్ స్టేషన్కు రప్పించి టోకెన్లు ఇవ్వడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.