కృష్ణా: మోపిదేవి మండలం కప్తానుపాలెం వద్ద శనివారం సాయంత్రం రోడ్డు ప్రమాదంలో పాస్టర్ మృతి చెందారు. స్థానికుల వివరాల ప్రకారం.. బాపట్ల జిల్లా కొల్లూరు మండలం జువ్వలపాలెంకు చెందిన పాస్టర్ కొక్కిలిగడ్డ జక్రియ బాబు (55 ) బైకుపై చల్లపల్లి నుంచి వెళుతున్నారు. ఈ నేపథ్యంలో రేపల్లె నుంచి వస్తున్న కారు రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని తప్పించబోయి బైకును ఢీ కొట్టగా అక్కడికక్కడే మృతి చెందాడు.