ADB: రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అదిలాబాద్ నియోజకవర్గ అసెంబ్లీ ఇన్చార్జ్ కంది శ్రీనివాసరెడ్డి శనివారం హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై ముఖ్యమంత్రితో చర్చించినట్టు శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేసినట్లు తెలిపారు.