KDP: టూ టౌన్ సీఐ జి. సుబ్బారావు డ్రగ్స్ రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇవాళ సాయంత్రం బిస్మిల్లా నగర్లో పోలీసు కళా జాగృతి బృందం ఆధ్వర్యంలో ‘యువతా మేలుకో’ నాటక ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా మత్తు పదార్థాల వాడకం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు, అనర్థాలు, సమాజ రుగ్మతలపై అవగాహన కల్పించారు.