VSP: గాజువాక జోన్ పరిధిలోని వై జంక్షన్ కూడలి నుంచి స్టీల్ ప్లాంట్‌కు వెళ్లే ప్రధాన రహదారిపై దుర్గానగర్ వద్ద భారీ గోతులు ఏర్పడటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీపీఐ జిల్లా సమితి సభ్యులు జి. ఆనంద్ శనివారం తెలిపారు. దుర్గానగర్ కూడలి వద్ద ఏర్పడిన గోతిని జీవీఎంసీ అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు.