బీజేపీ, బీఆర్ఎస్ మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీలు సుదర్శన్ రెడ్డికి ఎందుకు ఓటు వేయలేదని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణకు అప్పగించినా, కేంద్రం ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులపై రాహుల్ గాంధీ స్పందించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.