SKLM: ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి పనులు కూడా కూటమి ప్రభుత్వ ప్రాధాన్యం ఇస్తుందని ఆమదాలవలస ఎమ్మెల్యే & రాష్ట్ర పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ అన్నారు. శనివారం మండలంలోని లోలుగు గ్రామం నుంచి వీఆర్ గూడెంకు రూ.3.90 లక్షలతో నిర్మించిన నూతన బీటీ రోడ్డును ఎమ్మెల్యే ప్రారంభించారు. మిగిలిన అభివృద్ధి పనులను పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు.