మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యురాలు పోతుల కల్పన అలియాస్ సుజాతక్క పోలీసుల ఎదుట లొంగిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమెను పోలీసులు మీడియా ముందు హాజరుపరిచారు. కాగా గద్వాలకు చెందిన సుజాతక్క 43 ఏళ్ల పాటు అజ్ఞాతంలో ఉంది. దాదాపు 106 కేసుల్లో నిందితురాలిగా ఉన్న ఆమెపై రూ.కోటి రివార్డు ఉంది.