AP: నెల్లూరు జిల్లా ఆత్మకూరు బాలికల గురుకుల పాఠశాలలో విష జ్వరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. సుమారు 40 మంది వరకు విషజ్వరాల బారిన పడ్డారు. ప్రభావం ఎక్కువగా ఉండడంతో 20 మందిని ఇంటికి పంపించినట్లు ప్రిన్సిపల్ వెల్లడించారు. మరో 20 మంది విద్యార్థులు స్కూల్లోనే ఉండి చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపారు. స్కూల్ పక్కన డంపింగ్ యార్డ్ ఉండడంతో విష జ్వరాలు వస్తున్నట్లు ప్రిన్సిపల్ చెప్పారు.