మణిపూర్లో హింస చెలరేగిన రెండేళ్ల తర్వాత ప్రధాని మోదీ అక్కడ పర్యటించడంపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ విమర్శలు చేశారు. ఏదైనా ప్రమాదం లేదా విషాదం జరిగినప్పుడు, ప్రధాని వెంటనే అక్కడికి వెళ్లి బాధితులను పరామర్శించడం మన దేశ సంప్రదాయమని ఆమె అన్నారు. కానీ, మోదీ మాత్రం రెండేళ్లు ఆలస్యంగా వెళ్లారని ఎద్దేవా చేశారు. ఇది మన ప్రధానుల సంప్రదాయం కాదని ప్రియాంక గాంధీ అన్నారు.