VSP: విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో శనివారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన చేశారు. జె.పి. నడ్డా విశాఖ పర్యటనలో విభజన చట్ట హామీలపై, ఉక్కు ప్రైవేటీకరణపై స్పష్టం చేయాలని నేతలు కోరారు. కూటమి ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని ప్రశ్నించిన వారు.. ఉక్కు ప్రైవేట్ పరం చేస్తే ప్రజలు తిరస్కరిస్తారని హెచ్చరించారు.