KDP: వేంపల్లి మండలం తాళ్లపల్లెలో ఇవాళ IIIT NSS యూనిట్ -13 బృందం స్వచ్ఛభారత్ కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా స్థానిక ఆరోగ్య కేంద్రం నుంచి స్వర్ణాంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛభారత్ పేరుతో గ్రామంలో ర్యాలీ నిర్వహించి అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి, తమ పరిసరాలను ప్రతి ఒక్కరూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.