ప్రకాశం: జిల్లాకు SPగా వి. హర్షవర్ధన్ రాజు నియమితులైన విషయం తెలిసిందే. నెల్లూరు జిల్లాలోని కావలికి చెందిన ఈయన అనంతపురం JNTUలో బీ.టెక్ పూర్తి చేశారు. 2013లో రాష్ట్ర పోలీసు సేవల్లో చేరారు. విజయవాడలో DCP, అన్నమయ్య, కడప జిల్లాల SP, విజయవాడలో CID SP, ఎర్రచందనం టాస్క్ఫోర్స్ ఎస్పీగా కీలక పాత్రల్లో ఆయన పనిచేశారు.