ADB: ఆదిలాబాద్‌లోని విజయ్ డెయిరీ మిల్క్ చిల్లింగ్ సెంటర్లో విషాదం చోటు చేసుకుంది. శనివారం ప్రమాదవశాత్తు విద్యుత్ తీగ తెగిపడటంతో గర్భంతో ఉన్న ఓ గేదె మృతి చెందింది. ఈ ఘటనలో రూ. 80 వేల వరకు నష్టం వాటిల్లిందని గేదె యజమానురాలు కళాశ్రీ ఆశ్రమానికి చెందిన రాజశ్రీ శర్మ తెలిపారు. పశు వైద్యాధికారి దూద్ రామ్ రాథోడ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.