HYD: శామీర్‌పేట్‌లోని నల్సార్ యూనివర్సిటీలో రెండు రోజులుగా జరిగిన కార్పొరేట్ గవర్నెన్స్ సదస్సు శనివారం ముగిసింది. ICSI, నల్సార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక, గిరిజన సమాజాలు ప్రకృతి వనరులను వస్తువులుగా చూడవని, ప్రకృతితో సామరస్యంగా జీవిస్తాయని గవర్నర్ తెలిపారు.