VKB: మోమిన్పేట్ మండలం ఎనికేపల్లి గ్రామంలో గత రెండు రోజులుగా విద్యుత్ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం, ఈదురు గాలలు లేకపోయినా విద్యుత్ సరఫరా నిలిచిపోవడం స్థానికులను ఆందోళనకు గురిచేస్తుంది. అధికారులు తక్షణమే స్పందించి విద్యుత్ సరఫరాను పునరుద్దరించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.