WGL: జిల్లా కేంద్రంలో శనివారం బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో సేవా పక్వాడా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వద్దిరాజు రామచంద్రరావు, ప్రధాని మోదీ పేదల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని కొనియాడారు. స్థానిక ఎన్నికల్లో కార్యకర్తలు కష్టపడి బీజేపీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ నేతలు తదితరులు ఉన్నారు.