MDK: కౌడిపల్లి మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించి ప్రభుత్వ ఆసుపత్రుల వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రానున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా మంజీర నది పరివాహక ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.