గుంటూరులోని కంకరగుంట రైల్వే గేట్ సమీపంలో శనివారం ఒక గుర్తు తెలియని యువకుడి మృతదేహం లభ్యమైంది. సీఆర్పీ, జీఆర్పీ పోలీసులు, గుంటూరు కోవిడ్ ఫైటర్స్ ఛారిటబుల్ ట్రస్ట్ సభ్యులు కలిసి మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.