CTR: చిత్తూరు పట్టణములోని ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లపై ఇవాళ కొందరు దుండగులు దాడి చేశారు. దాడి ఘటనపై డాక్టర్ జి. మనోజ్ కుమార్ ఫిర్యాదు చేసినట్లు చిత్తూరు 2 టౌన్ సీఐ నెట్టికంఠయ్య తెలిపారు. దాడి సంఘటనలో ఆరుగురిపై కేసు నమోదు అవ్వగా ఇప్పటికే ఒకరిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. మరో 5గురిని త్వరలో అరెస్టు చేస్తామని పేర్కొన్నారు.