KMR: అర్మూర్ మండల కేంద్రంలోని కల్లెడ గ్రామంలో శనివారం ప్రముఖ న్యాయవాది, మాజీ ప్రభుత్వ పబ్లిక్ ప్రాసిక్యూటర్, బీఆర్ఎస్ నాయకులు పెద్దగాని కిరణ్ కుమార్ గౌడ్ మృతి చెందారు. ఆయన పార్థివదేహానికి నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల నివాళులర్పించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసి ధైర్యంగా ఉండాలన్నారు.