SKLM: కవిటి మండలం జాడుపూడి ఆర్ఎస్లోని ఓ పెట్రోల్ బంక్ ఆవరణలో సోంపేట ఫైర్ ఆఫీసర్ ఆర్ సూర్యారావు ఆధ్వర్యంలో అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అగ్నిప్రమాదాల నివారణ పరికరాల వినియోగాన్ని వివరించారు. అగ్నిప్రమాదాల పట్ల పెట్రోల్ బంక్ సిబ్బంది, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని ఫైర్ ఆఫీసర్ అన్నారు.