AKP : నర్సీపట్నం టౌన్ సీఐ గోవిందరావు ఆధ్వర్యంలో ఇవాళ సాయంత్రం జోగనాదపాలెం గ్రామ శివార్లలో డ్రోన్ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా బలిఘట్టం వై జంక్షన్ వద్ద బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తున్న ఇద్దరు వ్యక్తులపై కేసులు నమోదు చేశారు.సీఐ మాట్లాడుతూ.. అసాంఘిక కార్యక్రమాలను అరికట్టేందుకు డ్రోన్ తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు.