KRNL: కోసిగి మండల పరిధిలోని వివిధ గ్రామాలలో పట్టుబడిన రూ. 4,40,000 విలువ చేసే అక్రమ మద్యాన్ని ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ సూపరింటెండెంట్ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఇవాళ స్తానిక మార్కెట్ యార్డ్ సమీపంలో ధ్వంసం చేశారు. మొత్తం 63 కేసులలో 804 లీటర్ల మద్యాన్ని ధ్వంసం చేశారు. ఇందులో సీఐ భార్గవ్ రెడ్డి, సీఐ మంజునాథ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.