KRNL: గోనెగండ్ల మండలంలోని జిల్లా ఉన్నత పరిషత్ పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఎడ్ల బండలాగుడు పోటీలను MLA జయనాగేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. అంతకుముందుకు గంజహళ్లి రోడ్డు నుంచి ఆయన ఊరేగింపుగా బయలుదేరి వచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకి బండలాగుడు పోటీల నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. అనంతరం శ్రీశ్రీ చింతలాముని నల్లారెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు.