ELR: ముసునూరు మండలం బలివే పుణ్యక్షేత్రంలో వేంచేసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 24వ తేదీన ఉదయం 10 గంటలకు ధర్మకర్తలు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు కార్య నిర్వహణాధికారి పామర్తి సీతారామయ్య తెలిపారు. ఆలయంలో ఆయన శనివారం మాట్లాడుతూ.. బొమ్మకంటి శ్యామలరావు ఛైర్మన్గా, పి నాగేశ్వరరావు, తోలేటి అరుణ భాస్కరరావులతో 8 మంది సభ్యులు ఉంటారన్నారు.