AKP: రైతు సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఎలమంచిలి నియోజకవర్గం టీడీపీ సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరరావు సూచించారు. అచ్యుతాపురం మండలం దుప్పితూరు పీఏసీఎస్ అధ్యక్షుడిగా నియమితులైన వెంకటరమణ ఇవాళ నాగేశ్వరావుతో భేటీ అయ్యారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసినందుకు తగిన గుర్తింపుగా ఈ పదవి లభించినట్లు నాగేశ్వరావు అన్నారు. సొసైటీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.