అన్నమయ్య: జిల్లాలో మూడు బార్లకు దరఖాస్తుల గడువు ఈ నెల 17 వరకు పొడిగించామని జిల్లా ఎక్సైజ్ అధికారి మధుసూదన్ తెలిపారు. రాయచోటి, మదనపల్లె, పీలేరు పట్టణాల్లో ఒక్కో బార్‌కు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆసక్తిగల వారు గడువులోగా అబ్కారీ శాఖ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. లాటరీ ద్వారా కేటాయింపు 18న ఉదయం 8 గంటలకు కలెక్టర్ PGRS హాల్లో జరగనుంది.