SRD: నారాయణఖేడ్ జూనియర్ సివిల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో శనివారం జరిగిన లోక్ అదాలత్‌కు స్పందన లభించింది. ఖేడ్ పోలీస్ డివిజన్ పరిధిలోని అన్ని మండలాల పోలీస్ స్టేషన్‌లోని పెండింగ్ కేసులు రాజీ మార్గంతో పరిష్కారం అవుతున్నాయి. ఈ మేరకు స్థానిక న్యాయమూర్తి మంథని శ్రీధర్ ఇరు వర్గాలను విచారించి కేసులను పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నారు.