AP: మాజీ సీఎం జగన్‌కు మంత్రి సత్యకుమార్ యాదవ్ లేఖ రాశారు. మెడికల్ కాలేజీలపై దుష్ప్రచారం ఆపాలని సూచించారు. 17 మెడికల్ కాలేజీలు తెచ్చానని జగన్ అనడం అబద్ధమన్నారు. రూ.8,480 కోట్లతో మెడికల్ కాలేజీలు ప్రతిపాదించి.. రూ.1,451 కోట్లకే బిల్లులు చెల్లించారని తెలిపారు. మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు తీసుకురాలేకపోయారని.. జగన్‌లా తాము విఫలం కాకూడదనే PPPని ఎంచుకున్నామని అన్నారు.