AP: విజయవాడ గిరిపురంలో హిజ్రాలు దాడి చేశారని మహిళ ఆత్మహత్యయత్నం చేసింది. ప్రేమికుల మధ్య వివాదం తలెత్తడంతో ఈనెల 11న యువకుడి ఇంటిపై 20 మంది హిజ్రాలు దాడి చేశారు. యువకుడితోపాటు అతని తండ్రి కుమార్, తల్లి కుమారిపైనా దాడికి పాల్పడ్డారు. దీంతో మనస్తాపానికి గురై కుమారి ఫ్యాన్‌కు ఉరేసుకుంది. కుటుంబ సభ్యులు గమనించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఇవాళ కుమారి మృతి చెందింది.