VKB: బంట్వారం మండల కేంద్రంలోని బస్టాండు వెనక వైపు నుంచి కొల్లం బసవేశ్వర దేవాలయనికి వెళ్లే ప్రధాన రోడ్డుపై నీరు నిలిచి అధ్వానంగా తయారైంది. ఆ మార్గంలో వెళ్లే రైతులు, పాదాచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కొద్దిపాటి ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించి రోడ్డు సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.