కొంతమంది ఉద్యోగస్తులు తాము వ్యాయామం చేయట్లేదని చింతిస్తుంటారు. అయితే వారు ఆఫీసులో కూర్చున్నప్పుడు మధ్యమధ్యలో లేచి నిల్చోవడమైనా అలవాటు చేసుకోవాలి. ఇలా చేస్తే గుండె ఆరోగ్యం కాపాడుకోవచ్చు. ముఖ్యంగా మహిళలకు ఇది ఎంతో మేలు చేస్తుంది. నిజానికి తక్కువగా కూర్చోవడమే మంచిదని పరిశోధనలు వెల్లడించాయి.