GNTR: భారీ వర్షాల నేపథ్యంలో నగరంలో ముంపు సమస్యలు తలెత్తకుండా నగర పాలక సంస్థ ప్రత్యేక చర్యలు చేపట్టింది. కమిషనర్ శ్రీనివాసులు శనివారం పలు ప్రాంతాల్లో పరిశీలించి, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వర్షం తగ్గే వరకు అధికారులు, సచివాలయ కార్యదర్శులు ఉండాలని, సమస్యలు తలెత్తినప్పుడు వెంటనే స్పందించడానికి 0863-2345103 హెల్ప్ లైన్ అందుబాటులో ఉందని ఆయన తెలిపారు.