నంద్యాల: శక్తి టీం సభ్యులు డీఎన్ ప్రసాద్, వెంకటేశ్వర్లు, రఫీ మహిళా పోలీస్ స్నేహలత క్రాంతి నగర్లోని బీసీ వెల్ఫేర్ హాస్టల్లో విద్యార్థినులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఇవాళ ఏఎస్పీ జావలి ఆదేశాల మేరకు హాస్టల్లోని సీసీ కెమెరాలు పరిశీలించారు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతే వెంటనే 112, 100 టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు.