ATP: UPSC ఆధ్వర్యంలో రేపు నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నావల్ అకాడమీ (ఎన్డీఏ), కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ (సీడీఎస్) పరీక్షలు జరగనున్నాయని డీఆర్వో మలోల తెలిపారు. అనంతపురంలో రెండు కేంద్రాల్లో జరిగే ఈ పరీక్షలకు 252 మంది అభ్యర్థులు హాజరవుతారని అన్నారు. నగరంలోని జేఎన్టీయూలో సీడీఎస్ పరీక్ష మూడు సెషన్లలో జరగనుందని తెలిపారు.