AKP: ఆటో కార్మికులకు వాహన మిత్ర పథకం ద్వారా కూటమి ప్రభుత్వం ఏడాదికి రూ.15,000 ఆర్థిక సహాయం ప్రకటించిన నేపాధ్యంలో వారు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఇవాళ పరవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, తదితరులు పాల్గొన్నారు.