MNCL: తాండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు SI కిరణ్ కుమార్ శనివారం తెలిపారు. తాండూర్ శివారులో పేకాట ఆడుతున్నట్లు సమాచారం రావడంతో సిబ్బందితో కలిసి వెళ్లి దాడి చేసి పట్టుకోవడం జరిగిందన్నారు. పట్టుకున్న వారి వద్ద నుండి రూ.1090 నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.