KRNL: మనేకుర్తిలో భక్త కనకదాసు విగ్రహం పై దాడి చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదని ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. ఇవాళ ఆదోనిలో ఓ ప్రైవేట్ ప్రోగ్రాంలో పాల్గొనేందుకు వచ్చిన ఎంపీని మనేకుర్తి గ్రామస్తులు కలిశారు. విగ్రహం పై జరిగిన దాడి గురించి చర్చించారు. దాడి జరగడం దారుణం అన్నారు. దాడికి పాల్పడిన వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరడం జరిగిందని తెలిపారు.