CTR: పుంగనూరులోని కుమ్మర వీధిలో కొలువు దీర్చిన వినాయక ప్రతిమ నిమజ్జనం ఆదివారం సందడిగా సాగింది. గణనాథునికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అనంతరం యువకులు, పిల్లలు, మహిళలు నృత్యాలు చేస్తూ డబ్బులు వాయిస్తూ రంగులు చల్లుకుంటూ విగ్రహాన్ని నిమజ్జనానికి తరలించారు. ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.